బ్రేకింగ్ న్యూస్.. తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు ఓపెన్

by Anukaran |   ( Updated:2021-07-06 00:43:57.0  )
new liquor policy
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయాన్ని పెంచడం, మద్యం మాఫియాను అణిచివేసే ప్రయత్నంలో 2021-22 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటిస్తూ ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన ఎక్సైజ్ పాలసీ 2021-22లో భాగంగా బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులను తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఉదయం 10 గంటలకు తెరుచుకున్న బార్లు, రెస్టారెంట్‌లు, క్లబ్బులు తెల్లవారుజామును 3 గంటల వరకు (దాదాపు 17 గంటలు) పాటు తెరిచే ఉండనున్నాయి. ఇదే సమయంలో హోమ్ డెలివరీ పైన మాత్రం ఎటువంటి వివరణ ఇవ్వలేదు కేజ్రీవాల్ గవర్నమెంట్. నూతన విధానంపై పలువురు ఢిల్లీ వాసులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed