అతిపెద్ద కరోనా ఆసుపత్రి ప్రారంభం

by  |
అతిపెద్ద కరోనా ఆసుపత్రి ప్రారంభం
X

న్యూఢిల్లీ: ప్రపంచంలోకెల్లా అతిపెద్ద కొవిడ్ కేర్ సెంటర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆదివారం ప్రారంభించారు. 10 వేల పడకల సౌకర్యం కలిగిన ఈ కేర్ సెంటర్ 20 ఫుట్‌బాల్ ఫీల్డుల వైశాల్యమంత ఉంటుంది. దక్షిణ ఢిల్లీలోని రాధాస్వామి బియాస్ సత్సంగ్‌ను కరోనా కేర్ సెంటర్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఇందులో 50 పడకలతో 200 ఎన్‌క్లోజర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా అనిల్ బైజాల్ మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రజల కోసమే సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ఇక్కడి వైద్య బృందంలో సైకియాట్రిస్టులు ఉన్నారని, మతిస్థిమితం లేని పేషెంట్లకూ చికిత్స అందిస్తారని పేర్కొన్నారు. ఇందులో 10 శాతం బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం ఉన్నట్లు వెల్లడించారు. ఐటీబీపీ ఈ సెంటర్‌ను పర్యవేక్షిస్తుందని, స్వల్ప, లేదా లక్షణాలు కనిపించని కరోనా పేషెంట్ల కోసం ఈ సెంటర్‌ను వినియోగిస్తామని తెలిపారు. అలాగే, హోం ఐసొలేషన్ సదుపాయం లేనివాళ్లూ ఈ సెంటర్‌కు రావొచ్చని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed