- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ వ్యవహారంలో సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలపై స్టే!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, రిటైల్ మార్కెట్ల దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్ మధ్య జరిగిన ఒప్పందం విషయంలో ఇంకా ఊగిసలాట కొనసాగుతోంది. ఈ ఒప్పందం విషయంలో అమెజాన్‌కు ఢిల్లీ హైకోర్టు ఉన్నత ధర్మాసనం షాక్ ఇచ్చింది. గతవారం రిలయన్స్‌తో ఒప్పందం అంశంపై ముందుకెళ్లొద్దన్న ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులను సోమవారం ఢిల్లీ హైకోర్టు ఉన్నత ధర్మాసనం స్టే విధించింది. అంతేకాకుండా, ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిశోర్ బియానితో పాటు ఇతరుల ఆస్తులను జప్తు చేయడాన్ని కూడా నిలిపేయాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఫ్యూచర్ గ్రూప్ సంస్థ శనివారం వేసిన వ్యాజ్యంపై జస్టిస్ జస్మిత్ సింగ్, డి ఎన్ పటేల్‌తో కూడా ధర్మాసనం విచారణ జరిపి ఈ ఒప్పందంపై సవాల్ చేసిన అమెజాన్‌కు నోటీసులు ఇచ్చింది. అనంతరం విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది.
అసలు సంగతేంటంటే..
ఫ్యూచర్ గ్రూపునకు చెందిన రిటైల్, లాజిస్టిక్స్, హోల్‌సేల్, వేర్‌హౌసింగ్ వ్యాపారాల కొనుగోలుకు రిలయన్స్ గతేడాది ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 24,713 కోట్లు. అయితే, ఫ్యూచర్ గ్రూపునకే చెందిన ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్‌లో అమెజాన్ 49 శాతం పెట్టుబడులను కొన్నది. ఇది 2019లో జరిగిన ఒప్పందం. ఫ్యూచర్ కూపన్స్‌కు 7.3 శాతం వరకు ఫ్యూచర్ రిటైల్‌లో వాటా ఉండగా, 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల మధ్య ఫ్యూచర్ రిటైల్‌ను కొనుగోలు చేసేందుకు అమెజాన్‌కు హక్కుంది. ఈ క్రమంలో రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య జరిగిన ఒప్పందం చెల్లదని అమెజాన్ వాదిస్తోంది. దీనిపై సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టులో సవాల్ కూడా చేసింది. కోర్టు ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ మధ్య ఒప్పందంపై స్టే విధించింది. తుది నిర్ణయం వరకు ఈ ఒప్పందం ముందుకెళ్లకూడదని ఆదేశించింది. ఈ తీర్పును సమర్థిస్తూ గతవారం 18న సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు వెలువరించింది.