ఆర్థిక, ఉద్యోగాల కల్పనకు కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

by  |
ఆర్థిక, ఉద్యోగాల కల్పనకు కేజ్రీవాల్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కల్పిస్తూ పెద్దసంఖ్యలో ఉద్యోగాలను అందుబాటులోకి తెచ్చేలా నూతన ఎలక్ట్రిక్ హన విధానాన్ని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం ఆవిష్కరించారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యం నియంత్రణే లక్ష్యంగా ఈ నూతన విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

తాము చేపట్టిన నూతన ఎలక్ట్రిక్ వాహన విధానంతో ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రావడమే కాకుండా, ఢిల్లీ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తామని సీఎం ఆకాంక్షించారు. దీని కింద రానున్న ఐదేళ్లలో 5 లక్షల విద్యుత్ వాహనాలను రిజిస్టర్‌ చేయునున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు.

విద్యుత్ వాహన విధానం కింద బైకులు, ఆటోలు, ఈ -రిక్షాలకు రూ. 30,000, కార్లకు రూ 1.5 లక్షల వరకూ ప్రోత్సాహకాన్ని ఆయన ప్రకటించారు. ఈ విధానం కింద ఆ వాహనాలను కొనుగోలు చేసేవారికి ఈ ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టంచేశారు. నూతన విధానాన్ని అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం త్వరలో రాష్ట్ర విద్యుత్ వాహన బోర్డును ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు.

ఈ-వాహనదారుల సౌకర్యం కోసం ఏడాదిలోనే 200 ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్‌ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన విధానం కింద రిజిస్ర్టేషన్‌ ఫీజు, రోడ్డు పన్నును ఎత్తివేస్తామని ప్రకటించారు. విద్యుత్ కమర్షియల్‌ వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తామని ప్రకటించారు.


Next Story

Most Viewed