- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో ప్రేమోన్మాది ఢిల్లీ బాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న తన ప్రియురాలు గాయత్రిని కత్తితో పొడిచి అటవీప్రాంతంలోకి వెళ్లిన ఢిల్లీ బాబు బుధవారం పెనుమూరు మండలం తూర్పుపల్లి సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. అయితే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గాయత్రి చనిపోయిన కొంతసేపటికే ఆగ్రహానికి గురైన ఆమె తరపు బంధువులు ఢిల్లీబాబు ఇంటిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఢిల్లీ బాబు తండ్రిపై కూడా తీవ్రంగా దాడి చేశారు. ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నాడు.
రెండేళ్లుగా ఢిల్లీబాబు, గాయత్రి ప్రేమించుకుంటున్నారు. రెండు నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే గాయత్రి మైనర్ కావడంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి యువతిని ఇంటికి పంపించడంతో అప్పటి నుంచి ఢిల్లీ బాబును దూరం పెట్టింది. యువతికి చాలాసార్లు ఢిల్లీబాబు ఎదురుపడినా మాట్లాడకపోవడంతో కోపం పెంచుకున్నాడు. నిన్న మధ్యాహ్నం బయట కనిపించిన గాయత్రిని ఢిల్లీ బాబు కత్తితో పొడిచి చంపి ఇవాళ తాను కూడా ప్రాణం తీసుకున్నాడు. గాయత్రి, ఢిల్లీబాబు కుటుంబ సభ్యులు తీవ్ర దుఖంలో మునిగిపోయారు.