- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిమ్స్‌లో సర్జరీలపై ఆంక్షలు.. ఎప్పటినుంచంటే!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు లక్షకు తగ్గకుండా నమోదవుతుండటంతో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. పడకల కొరత ఏర్పడుతున్నది. అందుకే ఓపీడీ రిజిస్ట్రేషన్‌లు, సర్జరీలపై పలు ఆస్పత్రులు ఆంక్షలు విధిస్తున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ కూడా శనివారం నుంచి సర్జరీలపై ఆంక్షలు విధించనున్నట్టు ప్రకటించింది. రేపటి నుంచి కేవలం అత్యవసరమైన సర్జరీలను మాత్రమే నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఇక్కడ ఔట్ పేషెంట్ల రిజిస్ట్రేషన్‌ను గురువారం నుంచే నిలిపేసిన సంగతి తెలిసిందే. స్పెషల్ క్లినిక్స్ సహా వాక్ ఇన్ ఓపీడీ రిజిస్ట్రేషన్లను నిలిపేసినట్టు వైద్యాధికారులు తెలిపారు. ముందస్తు అపాయింట్‌మెంట్లు తీసుకున్నవారిని మాత్రమే అడ్మిషన్‌కు అనుమతిస్తామని వివరించారు.
ఢిల్లీ హాస్పిటల్‌లో 37 మంది వైద్యులకు పాజిటివ్
కరోనా పేషెంట్లకు చికిత్స అందించే క్రమంలో ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లో 37 మంది వైద్యులు కరోనాబారినపడ్డారు. ఇందులో అధికులు యువకలే. టీకా తీసుకున్నవారే. చాలా మందికి మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయి. 32 మంది ఐసొలేషన్‌లోకి వెళ్లగా ఐదుగురు మాత్రం చికిత్స కోసం హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు.