- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విజయం కోటిరెడ్డిదే.. మేము ఎప్పుడో చెప్పాము..
దిశ,తుంగతుర్తి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటిరెడ్డిదే గెలుపు అంటూ మేము ఎప్పుడో చెప్పాము.. అయినా మళ్లీ మళ్లీ చెబుతున్నాం అన్నారు. కోటిరెడ్డి విజయాన్ని ఏ శక్తులు కూడా ఆపలేవనే విషయం ఖరాఖండిగా తేలిపోయిందని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావులు వెల్లడించారు. శుక్రవారం వారు వేర్వేరుగా దిశతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోటిరెడ్డి వైపే మెజార్టీ సభ్యులు ఉన్నారన్నారు. అయినా కూడా కొంత మంది తామే గెలుస్తామని చెప్పుకోవడం మూర్ఖత్వమని పేర్కొన్నారు.
కేసీఆర్ ఉన్నంతకాలం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు టిఆర్ఎస్ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేని స్థితిలో ఉన్నాయన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేపట్టారని వివరించారు. కోటిరెడ్డి గెలుపు టీఆర్ఎస్ పార్టీ పటుత్వానికి, జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని వారు చెప్పుకోచ్చారు. అయితే తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ భువనగిరి జిల్లా కేంద్రంలో ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో భువనగిరి జిల్లాలోని మోత్కూర్ నుంచి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తుంగతుర్తి జడ్పిటిసి, సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు తన ఓటు హక్కును సూర్యాపేట లో వినియోగించుకున్నారు. అలాగే తుంగతుర్తి మండల ఎంపిపి గుండగాని కవిత రాములు గౌడ్ తో పాటు 12 మంది ఎంపీటీసీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.