రష్యా బయలుదేరిన… రాజ్‌నాథ్ సింగ్

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటనకు బయలుదేరారు. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేసన్‌ ఆధ్వర్యంలో బుధవారం రక్షణ మంత్రుల సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై కీలకంగా చర్చ జరుగనుంది. అంతేగాకుండా రష్యాతో భాగస్వామ్యంపై వ్యూహాత్మకంగా చర్చించే అవకాశం ఉంది. కాగా చైనా, భారత్ సరిహద్దు వివాదంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement