- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుణ్ సింగ్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం : రాజ్‌నాథ్ సింగ్
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద మృతులకు లోక్‌సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రమాద వివరాలు వెల్లడించారు. ‘‘సుల్లూరు ఎయిర్‌బేస్ నుంచి నిన్న(బుధవారం) ఉదయం 11:48కి హెలికాప్టర్ టేకాఫ్ అయింది. మధ్యాహ్నం 12:15కి విల్లింగ్టన్‌లో ల్యాండ్ కావాల్సి ఉండగా, 12:08కి సుల్లూరు ఏటీసీ నుంచి కాంటాక్ట్ తెగిపోయింది. ప్రమాద సమయంలో 13 మంది దుర్మరణం చెందారు. హెలికాప్టర్ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారు. హెలికాప్టర్ ప్రమాదంపై ఇప్పటికే ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో మిగిలారు. ప్రస్తుతం మిలిటరీ ఆసుపత్రిలో వరుణ్ సింగ్ చికిత్స పొందుతున్నారు. వరుణ్ సింగ్‌ను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు.’’ అని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.