సూర్య సాంగ్.. ట్రెండింగ్‌లో సునయన

by Shyam |   ( Updated:2022-09-03 12:30:29.0  )
సూర్య సాంగ్.. ట్రెండింగ్‌లో సునయన
X

దిశ, వెబ్‌డెస్క్: 'లలాయి లాయిరే లాయిరే లాయిరే.. లలాయి లాయిరే లాయిరే లాయిరే.. కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి.. మాటలు అన్నీ మరిచిపోయా నీళ్లే నమిలేసి..' సాంగ్ వినే ఉంటారు. సూర్య లేటెస్ట్ మూవీ 'ఆకాశమే నీ హద్దురా'లోని ఈ హిట్ సాంగ్.. సూపర్ లిరిక్స్, గ్రేట్ కొరియోగ్రఫీతో అమేజింగ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మరి దీనిపై కవర్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా.. దట్ టు సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన చేస్తే.. ఇంకా అద్భుతంగా ఉండదూ..! అఫ్‌కోర్స్ మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటున్నారు నెటిజన్లు. నిజమే మరి.. ఒరిజినల్ సాంగ్ నెల రోజుల్లో 13 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంటే.. దీప్తి సునయన కవర్ సాంగ్ 20 గంటలు గడవకముందే దాదాపు నాలుగు లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉందంటే అమేజింగ్ అన్నట్లే కదా.


డబ్ స్మాష్ ద్వారా దీప్తి సునయన సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అసలు తెలుగు రాష్ట్రాల్లో డబ్ స్మాష్ పాపులర్ అయిందే తన వల్ల అంటుంటారు సునయన ఫ్యాన్స్. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా మరింత పాపులర్ అయిన తనకు ఓ స్టార్ హీరోయిన్‌కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంటుందనుకోండి. తను ఎలాంటి ప్రయోగం చేసినా సక్సెస్ అవడం.. ముఖ్యంగా ప్రేక్షకులకు నచ్చడంతో తన యూట్యూబ్ చానల్ ఫాలోవర్స్ మూడున్నర లక్షలకు చేరుకుంది. తన చానల్‌లో కేవలం ఆరంటే ఆరు వీడియోలు మాత్రమే రిలీజ్ అయినా సరే.. దీప్తి సునయన టాలెంట్‌ను నిరూపించడంలో పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్స్‌గా ఉన్నాయనడంలో సందేహం లేదు.

ఈ క్రమంలోనే దీప్తి.. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన కవర్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. తన డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్‌తో కవర్ సాంగ్ ఓ రేంజ్‌లో ఉండగా.. క్లాస్ పర్‌ఫార్మెన్స్‌తో మరోసారి అదరగొట్టేసిందని కాంప్లిమెంట్స్ అందుకుంటోంది. తన కెరియర్‌ను తనకు నచ్చిన విధంగా మలుచుకుని చాలా మంది గర్ల్స్‌కు ఇన్‌స్పిరేషన్‌గా మారిందని.. మరోసారి బొమ్మ దద్దరిల్లేలా చేసిందని సూర్య ఫ్యాన్స్ కూడా తనకు సపోర్ట్ చేస్తున్నారు. తను సాంగ్ చేస్తే ఆ సాంగ్‌కే కొత్త అందం వస్తుందని అంటున్న ఫ్యాన్స్.. సాంగ్ ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని చెప్తున్నారు. ఇంత కఠిన సమయాల్లో కూడా ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు ట్రై చేయడమే కాదు, రాకింగ్ పర్‌ఫార్మెన్స్‌తో మతి పోగొట్టిందంటున్నారు.

Read Also…

కార్యదర్శులపై ఫుల్ వర్క్‌ప్రెషర్..!

Advertisement

Next Story