ఆ హీరోకు కండోమ్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నా.. దీపిక 

by Shyam |
ఆ హీరోకు కండోమ్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నా.. దీపిక 
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె తన మొదటి బాయ్‌ఫ్రెండ్ గురించి షాకింగ్ సీక్రెట్ చెప్పింది. ఇటీవలే ‘కాఫీ విత్ కరణ్‌’ టాక్ షోలో పాల్గొన్న నటికి ర్యాపిడ్ రౌండ్‌లో భాగంగా రణబీర్‌ కపూర్‌కు బహుమతిగా ఏం ఇవ్వాలనుకుంటున్నారనే ప్రశ్న ఎదురు కాగా.. కండోమ్స్ ప్యాక్‌ను బహుమతిగా ఇస్తానంది. ఎందుకంటే తనకు వాటితో ఎక్కువ అవసరం ఉంటుందని బాంబ్ పేల్చింది. అయితే దీపిక ఈ విషయం చెప్తున్నప్పుడు పక్కనే ఉన్న సోనమ్ కపూర్‌ సైతం ఈ వ్యాఖ్యలకు మద్దతివ్వడం విశేషం.

అయితే దీపిక స్టేట్‌మెంట్ వెనక అంతకుముందు కరణ్ జోహార్ షోలో రణబీర్ చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. ఆ టైమ్‌లో తను దీపికను ఆకర్షణీయమైన అమ్మాయిగా పేర్కొనగా.. ఇప్పుడు కౌంటర్ ఇచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీపిక ప్రస్తుతం ‘గెహ్రాయియాన్’ చిత్రంలో నటిస్తుండగా.. రీసెంట్‌గా విడుద‌లైన టీజర్‌లో దీపిక, సిద్ధాంత్ చ‌తుర్వేది మ‌ధ్య స‌న్నివేశాలు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారాయి.

https://www.hotstar.com/in/tv/koffee-with-karan/1525/deepika-padukone-and-sonam-kapoor/1000004233

Advertisement

Next Story