దీపిక జర్నీ.. ‘బ్యాడ్మింటన్ టు బాలీవుడ్’

దిశ, వెబ్‌డెస్క్ :
బాలీవుడ్ దివా దీపికా పదుకొనె.. ప్రజెంట్ ఇండియన్ సినిమా హీరోయిన్స్ లిస్ట్‌లో నంబర్ వన్ పొజిషన్‌కు చేరుకుంది. కానీ, చిన్నపటి నుంచి తండ్రి మాదిరిగా బ్యాడ్మింటన్ ప్లేయర్ కావాలనుకున్న దీపిక అసలు మోడలింగ్ రంగంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది? అక్కడి నుంచి సినీ ఇండస్ట్రీలో ఎలా అడుగు పెట్టింది? అనే విషయాలను నేషనల్ జియోగ్రాఫిక్ సిరీస్ ‘మెగా ఐకాన్స్ సీజన్ 2’లో పంచుకుంది.

చిన్నప్పటి నుంచి గంటల తరబడి బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసే తను.. టీనేజ్ వరకు కూడా అదే ఇంట్రెస్ట్‌తో ఉన్నానని తెలిపింది. కానీ 16 ఏళ్ల వయసులో ఒక్కసారిగా తన ఫోకస్ మోడలింగ్ వైపు మళ్ళిందని వెల్లడించింది. టెన్త్ క్లాస్ తర్వాత పలు కమర్షియల్ యాడ్స్‌కు చైల్డ్ మోడల్‌గా చేసిన దీపిక.. ఇందుకోసం తొలిసారి కోపెన్ హెగన్, డెన్మార్క్ లాంటి ప్రాంతాల్లో ఒంటరిగా ప్రయాణించింది. ఆ ట్రిప్ నుంచి ఇంటికి వచ్చిన దీపిక.. ఓ రోజు ఉదయం లేచి తల్లికి తన మనసులోని మాట చెప్పిందట. ‘అమ్మా.. నాన్న కోసమే బ్యాడ్మింటన్ ఆడుతున్నాను. కానీ నాకు మోడలింగ్‌పై చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఏదో ఒక రోజు మీరు గర్వపడేలా చేస్తా చూడండి’ అని. అప్పుడు ఆమె మాటలను తల్లి లైట్ తీసుకున్నా.. తను ఇచ్చిన మాట ప్రకారం తల్లిదండ్రులు గర్వపడేలా ఎదిగింది దీపిక.

యాక్టింగ్ కెరియర్ ప్రారంభించక ముందు పలు మోడలింగ్ అసైన్మెంట్స్ చేసింది దీపిక. డిజైనర్ వెండెల్ రాడ్ రిక్స్ డిజైనర్ దుస్తులు ధరించి రాంప్ వాక్ చేసిన దీపికను చూసి మలైకా అరోరా ఖాన్ ‘ఓం శాంతి ఓం’ సినిమా కోసం ఫరాహ్ ఖాన్‌కు రిఫర్ చేసిందట. అలా ఈ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో జోడీ కట్టడం.. సూపర్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా ఎదగడం జరిగిపోయాయి.

Advertisement