నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద..!

by Shyam |
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద..!
X

దిశ, వెబ్‎డెస్క్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పడుతోంది. ప్రాజెక్టు నాలుగు క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‎ఫ్లో, అవుట్‎ఫ్లో 77,733 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 311.1486 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను… ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులకు చేరింది.

Advertisement

Next Story