- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త నిబంధనలను 6 నెలలు పొడిగించిన ఆర్‌బీఐ!
దిశ, వెబ్‌డెస్క్: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ, ఇంకా ఇతర ప్రీపెయిడ్ చెల్లింపుల ద్వారా మొబైల్, కరెంట్, నీటి బిల్లులు, ఓటీటీ బిల్లులను ఆటోమెటిక్ విధానంలో చెల్లింపులు జరుపుతున్న వినియోగదారులకు ఆర్‌బీఐ భారీ ఊరటనిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఆటోమెటిక్ చెల్లింపుల కోసం ప్రీ-డెబిట్ నోటిఫికేషన్ నిబంధనలను సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కొత్త మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది.
ఆటోమెటిక్ రికరింగ్ చెల్లింపుల కోసం కస్టమర్ల నుంచి అనుమతి తప్పనిసరి చేస్తూ ఆర్‌బీఐ నిబంధనలను ప్రవేశపెట్టింది. కార్డు లావాదేవీల్లో రక్షణ, భద్రతను పటిష్టం చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్న గతంలో ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అయితే, బ్యాంకులు ఈ అంశంలో పూర్తిగా సిద్ధంగా లేమని చెప్పడంతో ఆరు నెలలు పొడిగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఈ నిబంధనల ప్రకారం.. రికరింగ్ ఆటోమెటిక్ చెల్లింపులు రూ. 5 వేల కంటే ఎక్కువ ఉంటే బ్యాంకులు, కార్డు సంస్థలు, ఇతర అర్థిక సంస్థలు ఓటీపీ ద్వారా కస్టమర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. కస్టమర్ అనుమతి ఇచ్చిన తర్వాతే లావాదేవీలను పూర్తి చేయాలి. కస్టమర్ నుంచి అనుమతి లేకపోతే చెల్లింపు జరగదు. తాజా పొడిగింపుతో బ్యాంకులు, ఇతర సంస్థలకు, వినియోగదారులకు ఊరట లభించింది.