- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ రాబోతున్న ‘శ్రీ కృష్ణ’
దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు అలరించిన పాపులర్ సీరియళ్లను టీవీ చానెళ్లు మళ్లీ ప్రసారం చేస్తుండటం మనందరికీ తెలుసు. దూరదర్శన్ చానెల్‌లో రామాయణం, మహాభారతం సీరియల్స్‌ను తిరిగి ప్రారంభించడంతో విశేష ప్రేక్షకాదారణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో పౌరాణిక సీరియల్ ‘శ్రీకృష్ణ’ ను త్వరలోనే ప్రసారం చేయబోతున్నట్లు ప్రసారభారతి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
రామాయణం, మహాభారతాలకు దర్శకత్వం వహించిన రామనంద్ సాగరే ‘శ్రీ కృష్ణ’ సీరియల్ ను తెరకెక్కించారు. ఈ సీరియల్ లో శ్రీకృష్ణుడి జీవిత ఇతివృత్తం మొత్తం ఉంటుంది. భగవత పురాణం, హరివంశ, విష్ణు పురాణం, పద్మ పురాణం, గర్గ సంహిత, భగవద్గీత, మహాభారతం మొదలైన పురాణ గ్రంథాలను ఆధారంగా చేసుకుని ‘శ్రీ కృష్ణ’ సీరియల్‌ను తెరపైకి తీసుకు వచ్చారు. 1993లో దూరదర్శన్(డీడీ2)లో మొట్టమొదట ఈ సీరియల్ ప్రసారమయింది.
అప్పట్లో అత్యధిక రేటింగ్‌తో…
అత్యధిక రేటింగ్‌తో దూసుకుపోయిన ఈ సీరియల్.. ఆపై 1996 లో డీడీ నేషనల్ మళ్లీ మొదటి నుంచి ప్రసారం చేసింది. ఆ తర్వాత 1999లో జీ చానల్‌లో ప్రసారం చేశారు. 2001లో సోని, ఆపై స్టార్‌లలో పునం ప్రసారమైంది. 2016లో శివశక్తి సాయి అనే భక్తి చానెల్ లో కూడా ఈ సీరియల్ వచ్చింది. ఇప్పటికే అనేక ఛానెల్స్‌లో ప్రసారమైన ఈ పాపులర్ సీరియల్ తిరిగి డీడీలో ప్రసారం కాబోతుండడంతో అభిమానులు ఆనందిస్తున్నారు. మొత్తం 221 ఎపిసోడ్లుగా ఉన్న శ్రీకృష్ణా సీరియల్‌లో చిన్ని కృష్ణునిగా స్వప్నిల్ జోషి నటిస్తే.. పెద్ద కృష్ణునిగా, విష్ణువుగా సర్వదమన్ బెనర్జీ నటించారు. రుక్మిణీ, యమున, లక్ష్మీ, దుర్గలుగా పింకీ పర్కిత్ నటించారు. రేష్మ మోడీ రాధగా నటించారు. రవీంద్ర జైన్ సంగీతం అందించారు. ఈ సీరియల్ టైటిల్ సాంగ్ ‘శ్రీ కృష్ణ గోవిందా హరే మురారి’ మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యింది. ఈ సీరియల్ 100 కోట్లకు పైగా సంపాదించింది.
విదేశాల్లోనూ…
మారిషస్‌లోని ‘మారిషల్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్’లో, టోరొంటోలోని చానెల్ 57లో, నేపాల్ లోని నేపాల్ టెలివిజన్ చానెల్లో, సౌత్ ఆఫ్రికాలోని ఎమ్ నెట్ చానెల్లో, ఇండోనేషియాలో పీటీ సిప్టా టెలివిజన్‌లో, జకార్తాలోని పెండిడికన్, థాయ్‌లాండ్‌లోని చానెల్ 3లో, లండన్‌లోని టీవీ ఏసియాలలో ప్రసారమైంది.
tags :dd, shri krishna, ramanand sagar, doordarshan, prasar bharati