- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లారీని ఢీ కొట్టిన డీసీఎం.. డ్రైవర్ పరిస్థతి విషమం
దిశ, నల్లగొండ: ఆగి ఉన్న లారీని అతి వేగంతో డీసీఎం ఢీ కొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం శివారులో విజయవాడ నుంచి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ.. బ్రేక్ డౌన్ కారణంగా రోడ్డుపై నిలిచిపోయింది. అదే మార్గంలో వచ్చిన డీసీఎం.. లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దాని వెనుకే వచ్చిన మరో డీసీఎం కూడా ముందున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు డీసీఎంలలోని డ్రైవర్లు క్యాబిన్లోనే ఇరుక్కుపోయారు. పోలీసులు రెండో డీసీఎం డ్రైవర్ను వెంటనే బయటకు తీయగలిగారు. కానీ, మొదటి డీసీఎం డ్రైవర్.. లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోవడంతో బయటకు తీయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది. అనంతరం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
Tags: DCM, hitting, lorry, stopped, Driver situation is poisonous, nalgonda