- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐపీఎల్‌లో వార్నర్ అరుదైన రికార్డ్
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆదివారం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. సూపర్ ఓవర్‌తో సూపర్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా సూపర్ విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డెవిడ్ వార్నర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 5 వేల పరుగుల క్లబ్లో చేరాడు. ఐపీఎల్‌లో ఈ ఫీట్ అందుకున్న తొలి ఫారెన్ క్రికెటర్ వార్నర్ కావడం మరో విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికే కోహ్లీ(5,759), రైనా(5,368), రోహిత్(5,149) ఈ ఘనత సాధించారు. అయితే వీరందరికన్నా తక్కువ (135) ఇన్నింగ్స్‌ల్లోనే వార్నర్ ఈ ఘనత సాధించి మరో రికార్డు నెలకొల్పాడు.
Next Story