‘మైండ్ బ్లాక్’ చేసిన వార్నర్

by Shyam |
‘మైండ్ బ్లాక్’ చేసిన వార్నర్
X

క్రికెటర్ డేవిడ్ వార్నర్ లాక్‌డౌన్ టైమ్‌లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. తెలుగు హీరోల సాంగ్స్‌కు స్టెప్పులేయడమే కాదు, పవర్‌ఫుల్ డైలాగ్‌లు కూడా చెప్తూ నెట్టింట్లో జోష్ నింపుతున్నాడు. బుట్టబొమ్మ సాంగ్, బాహుబలి, పోకిరి డైలాగ్‌లతో అదరగొట్టిన వార్నర్‌కు తమ అభిమాన హీరోల సాంగ్స్‌పై టిక్‌టాక్ చేయాలంటూ ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్‌లు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫ్యాన్స్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుంచి మైండ్ బ్లాక్ సాంగ్‌పై డ్యాన్స్ వీడియో పోస్ట్ చేయాలని కోరారు.

ఫ్యాన్స్ రిక్వెస్ట్‌కు స్పందించి, అందుకు మే 30న రెడీగా ఉండాలని డేట్ ఫిక్స్ చేసిన వార్నర్.. చెప్పినట్లుగానే వీడియో రిలీజ్ చేశాడు. ఇంతకు ముందుకన్నా ఫుల్ గ్రేస్‌, జోష్‌తో ఈ మాస్ బీట్‌కు స్టెప్పులేశాడు. పార్ట్ 1 అంటూ వీడియో సెండ్ చేసిన వార్నర్ మాస్ డ్యాన్స్.. నిజంగానే మైండ్ బ్లాక్ చేసిందని నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. పైగా ‘పార్ట్ 2 కోసం వెయిటింగ్ అని.. వీలైనంత త్వరగా పోస్ట్ చేయాలి’ అని అభిమానులు కోరుతుండటం విశేషం.

https://twitter.com/davidwarner31/status/1266612964875857921?s=20

Advertisement

Next Story

Most Viewed