15 ఏళ్లకే ఆ బాలికకు ఎన్ని కష్టాలో.. పలుమార్లు తండ్రి అఘాయిత్యం.. చివరకు వారి చేతిలో చిక్కి!

by Anukaran |   ( Updated:2021-07-13 23:07:26.0  )
minor-girl-raped
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా దేవతా మూర్తులను కొలిచే సంస్కృతి మనది. ఒకప్పుడు విదేశాలకు ఆదర్శంగా నిలిచిన భారత్ ప్రస్తుతం వారి దేశాలకు చెందిన స్త్రీలను ఇక్కడికి పంపించాలంటేనే భయపడే స్థాయికి చేరుకున్నాం. కారణం దేశంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలే. గత కొన్నేళ్లుగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తుంటే మరికొన్ని రావడం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన మాత్రం 15 ఏళ్లకే ఓ బాలిక ఎదుర్కొన్న కష్టాలు దేశంలోని వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా చేసింది.

వివరాల్లోకి వెళితే.. బిహార్ రాష్ట్రం తూర్పు చంపారన్‌లోని మోతిహరి ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం తల్లికి తెలిసినా ఆమె ఏమీ పట్టనట్లు వ్యవహరించింది. అంతే కాకుండా మైనర్ అయిన కూతురిని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని చూడటంతో ఆ బాలిక ఇంటి నుంచి పారిపోయింది. ఓ రోజు బెంగళూరులోని సంఘమిత్ర రైలులో పోలీసులకు ఆ బాలిక కంటపడగా.. ఆమె ముఖంలో ఉన్న భయాన్ని, ఆందోళనను గుర్తించిన పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైనర్ బాలిక చెప్పిన విషయాలు విని ఆర్పీఎఫ్ పోలీసులు కళ్లు చెమర్చాయి. తాను ఇంట్లో నుంచి తప్పించుకుని వచ్చి నెలరోజులు అయిందని.. దానికి కారణం తన తల్లిదండ్రులు అని వివరించింది. తన తండ్రి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ఈ విషయం తెలిసినా తల్లి పట్టించుకోలేదని.. అంతేకాకుండా ఇష్టం లేని పెళ్లి చేయాలని చూశారని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది.

అంతే కాకుండా, తాను రైల్లో జర్నీ చేస్తున్న సమయంలో అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముఠా తనను పట్టుకున్నారని తెలిపింది. వారం పాటు వాళ్లు తనను ఓ చీకటి గదిలో బంధించి మద్యం, మత్తు పదార్థాలు ఇచ్చినట్లు చెప్పింది. ఆ తర్వాత తనను వేరే ప్రాంతానికి రైలులో తరలిస్తుండగా ఎలాగోలా తప్పించుకున్నానని ఆ బాలిక పోలీసులకు వివరించింది.

బెంగళూరుకు సమీపంలోని బంగారపేట్ జంక్షన్‌లో రైల్వే పోలీసులకు తాను ఎదుర్కొన్న కష్టాలను బాలిక వివరించగా.. చలించిపోయిన వారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి కొన్ని పరీక్షలు చేయించి చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌కు తరలించారు. చిన్న వయస్సులో కూతురి పట్ల బాధ్యతా రహిత్యంగా ప్రవర్తించిన తల్లిదండ్రులపై పోస్కో చట్టం ప్రకారం చర్యలు తీసుంటామని పోలీస్ అధికారి చెప్పారు. చివరగా అమ్మాయిలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు తనిఖీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed