డేటింగ్ యాప్స్ బ్యాన్..!

by  |
డేటింగ్ యాప్స్ బ్యాన్..!
X

దిశ వెబ్‎డెస్క్: ప్రస్తుత సమాజంలో డేటింగ్ యాప్స్ వినియోగం పెరిగింది. ఈ డేటింగ్ యాప్స్‎తో అనైతిక కంటెంట్ వ్యాప్తి చెందుతుందని.. పలు యాప్స్‎ను పాకిస్తాన్ బ్యాన్ చేసింది. టిండర్, గ్రైండర్‎తో పాటు మరో మూడు డేటింగ్ యాప్స్‎ను బ్యాన్ చేసినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండనందుకు బ్లాక్ చేసినట్లు వెల్లడించింది.

ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత రెండో అతిపెద్ద ముస్లిం మెజారిటీ ఉన్న పాకిస్తాన్ దేశంలో వివాహేతర సంబంధాలు, స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం. డేటింగ్ యాప్స్‎ను బ్యాన్ చేసే ముందు స్థానిక చట్టాలకు అనుగుణంగా కంటెంట్‎ను మార్చాలని నోటీసులు పంపినట్లు పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ తెలిపింది. నిర్ణీత సమయంలోపు కంపెనీలు స్పందించలేదని స్పష్టం చేసింది. దీంతో పాటు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అయిన యూట్యూబ్‎కు కూడా చట్టాలకు అనుగుణంగా కంటెంట్‎ను మోడరేట్ చేయాలని పాకిస్తాన్ ఆదేశించింది.



Next Story

Most Viewed