‘లైగర్’ ఫిక్స్ అయ్యాడు.. బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు!

by Jakkula Samataha |
‘లైగర్’ ఫిక్స్ అయ్యాడు.. బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు!
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ – పూరీ జగన్నాధ్ ‘లైగర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది క్యాప్షన్‌ కాగా, పూరి మార్క్‌తో వస్తున్న సినిమా నెవర్ బిఫోర్ మాస్ ఎంటర్‌టైన్మెంట్‌తో అలరించేందుకు సిద్ధమవుతోంది. ముందుగా చెప్పినట్లుగానే ఈ రోజు (గురువారం) ఉదయం 8:14 నిమిషాలకు మూవీ రిలీజ్ గురించి అప్‌డేట్ ఇచ్చేసింది చిత్ర యూనిట్. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 9న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన న్యూ పోస్టర్‌ అభిమానులకు కిక్ ఇస్తుండగా, ఇంటెన్స్‌ లుక్‌లో కనిపిస్తున్న విజయ్ పక్కా బ్లాక్ బస్టర్ కొడతాడనే ధీమాతో ఉన్నాడు. ‘డేట్ సెట్ అయింది, ఇండియా.. మేమొచ్చేస్తున్నాం’ అని పోస్ట్ పెట్టిన విజయ్.. నెక్స్ట్ అప్‌డేట్‌లో వచ్చే టీజర్‌తో నేషన్ వైడ్ మ్యాడ్‌నెస్‌కు గ్యారంటీ ఇచ్చాడు.

Advertisement

Next Story