మార్కెట్‌లోకి డేటా ప్యాటర్న్స్.. అరంగేట్రంలోనే లాభాలు..

by Harish |
DATA PATTERNS
X

దిశ, వెబ్‌డెస్క్: రక్షణ, ఏరోస్పేస్‌ రంగాలకు ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ సరఫరా చేసే డేటా ప్యాటర్న్స్ ఇండియా ఈ రోజు స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. బిఎస్‌ఇలో ఇష్యూ ధర రూ.585 కంటే ఎక్కువగా రూ.864 వద్ద ట్రేడ్‌ను ప్రారంభించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ప్రారంభ ధర రూ.856 వద్ద ప్రారంభమైంది. డిఫెన్స్, ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ సొల్యూషన్స్ రంగంలో ఉన్న బలమైన డిమాండ్‌ కారణంగా పెట్టుబడిదారుల నుండి అధికంగా 120 రెట్లు ఓవర్‌ సబ్​స్క్రైబ్ అయింది. IPOలో ఒక్కో లాట్‌కు 25 షేర్లు కేటాయించారు. ఒక్కో లాట్‌ విలువ రూ.13,875. ఈ రోజు నాటి లిస్టింగ్ ప్రైస్‌తో 46.32 శాతం ప్రీమియం లెక్కన ఒక్కో లాట్‌పై ఇన్వెస్టర్లు రూ.6,779 లాభాన్ని పొందారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా డేటా ప్యాటర్న్స్ రూ. 588.22 కోట్లను సమీకరించింది. ఈ సంస్థ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్లలో అగ్రగామిగా ఉంది. దేశీయంగా అభివృద్ధి చెందిన రక్షణ ఉత్పత్తుల పరిశ్రమలకు సేవలు అందిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed