- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనా చేతిలో 35 కోట్ల మంది ఇండియన్స్ డేటా!
దిశ, వెబ్‌డెస్క్: భారత్-చైనా సరిహద్దు (India-China border)లో మధ్య చెలరేగిన ఘర్షణలు ఇరుదేశాల మధ్య డిజిటల్ (Digital), పారిశ్రామిక రంగాల (Industrial sectors)పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం వరల్డ్ మోస్ట్ పాపులర్ అయిన టిక్ టాక్ (Tik tok), ఇతర యాప్‌లపై కూడా నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో ప్రధాని పిలుపు మేరకు భారత టెక్కీలు (Indian Techies) కొత్త యాప్‌లు (NEW APPS)రూపొందించి క్రమంగా డిజిటల్ (Digital)లోకి రంగ ప్రవేశం చేస్తున్నాయి. ఈ అంశం ఓ వైపు ఊరటనిస్తున్నా.. మరో వైపు చైనా యాప్, సర్వర్‌లల్లో భారతీయుల డేటా లీక్ అయింది? అన్న వార్త కలవరం పెడుతోంది. తాజాగా, సెక్యూరిటీ రీసెర్చర్ అనురాగ్ సేన్ (Security researcher Anurag Sen) ఓ చైనా యాప్‌కు డేటా లీక్ (Data leak) వ్యవహారంపై మెయిల్ (Mail) చేసినట్టు తెలుస్తోంది.
డిజిటల్ రంగం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఆన్‌లైన్ ద్వారా లోన్‌లు (Online loans) ఇచ్చేందుకు ఎన్నో యాప్‌లు (Apps)పుట్టుకొచ్చాయి. అరగంట సమయంలోపే అకౌంట్‌లో డబ్బులను వేస్తుండడంతో చాలా వరకు ప్రజలు ఆర్థిక అవసరాల కోసం వీటినే ఎంచుకుంటున్నారు. అయితే, వినియోగదారుల నుంచి ఈ యాప్‌లు పూర్తి సమాచారాన్ని కేటాయిస్తుండడం గమనార్హం.
ఈ తరహాలోనే చైనాకు చెందిన ఆన్‌లైన్ లోన్స్ ఇచ్చే (Micro Lending App) మొనీడ్ (Moneed)ను ఏకంగా 35 కోట్ల మంది భారతీయులు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)ద్వారా ఈ మైక్రో లెండింగ్ యాప్ సేవలు అందిస్తోంది. కాగా, ఈ యాప్‌ను ఇన్‌స్ట్రాల్ చేసుకున్న 35 కోట్ల మంది డేటా మాత్రం చైనా సర్వర్ (China Server)లో ఉన్నట్టు అనురాగ్ (Anuragh) గుర్తించారు. ఈ వ్యవహారంపైన సదరు కంపెనీకి మెయిల్ ద్వారా తెలియజేసి వివరణ ఇవ్వాలన్నారు. కానీ, మెయిల్ అందుకున్న ఆ సంస్థ తొలుత స్పందించలేదు. ఆ తర్వాత సమస్య ఏమీ లేదని అంత సాఫీగానే ఉన్నట్టు వివరణ ఇచ్చింది.
మొనీడ్ (Moneed) యాప్‌ను ఉపయోగిస్తున్న భారతీయుల డేటా (Indians Data) మాత్రం చైనా సర్వర్ (China Server)లో లేదని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ముంబయి సర్వర్ (Mumbai Server)లోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. తమ వద్దే ఉన్న డేటా భద్రం(Safe)గా ఉందని.. డేటా లీక్ అవ్వడం లేదని చెప్పుకొచ్చారు. మోస్ట్ పవర్‌ఫుల్ ఫైర్‌వాల్, సెక్యూరిటీ, (Most powerful firewall, Securities)భద్రతను మొనీడ్ (Moneed)కు ఏర్పాటు చేశామని వివరణ ఇచ్చారు.
అయితే, మొనీడ్ (Moneed) వివరణపై భారత సెక్యూరిటీ రీసెర్చర్లు (Indian Security Researchers)అనుమానం వ్యక్తం చేశారు. ఈ యాప్ వినియోగదారుల (Consumer)
కీలక సమాచారం (Key information) గ్రహిస్తోందని.. యాప్ పర్మిషన్ ఆందోళనకరంగా ఉందంటున్నారు.
దీని ద్వారా ఫోన్ కాంటాక్ట్స్ (Phone Contacts), ఫొటోస్ (Photos), వీడియోలు (Videos), ఫోన్ స్టోరేజ్ (Phone storage), వైఫై నెట్‌వర్క్ (WiFi network)లను సైతం హ్యాండిల్ చేసే పర్మిషన్న్ ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా హ్యాకర్ల (Hacker) చేతిలో పడితే ఫోన్ వైబ్రేషన్ (Phone Vibration)ను కంట్రోల్ (Control) చేస్తూ.. మొబైల్ యాక్సిస్ (Mobile Axis)ను పూర్తి స్థాయిలో మోడిఫై (Modified) చేయొచ్చని హెచ్చరించారు.
ఇదే తరహాలో మోమో (MoMo)యాప్‌లో యూజర్ల డేటా (User data) చైనా సర్వర్‌లో ఉందని సమాచారం. ఏకంగా 35 కోట్ల మంది డేటా మొనీడ్ (Moneed) చైనా సర్వర్‌లో లీక్ చేసిందన్న వార్తలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ.. డేటా లీక్ (Data leak)కు ఆస్కారం ఉందని సెక్యూరిటీ రీసెర్చర్స్ (Security Researchers) గట్టిగా వాదించడం ఆందోళనకరం.