- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డంజోలో వినియోగదారుల డేటా లీక్!
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై లాంటి ప్రధాన నగరాల్లో డెలివరీ సేవలందించే స్టార్టప్ కంపెనీ డంజో డేటా హ్యాక్ అయినట్టు కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ముకుంద్ ఝా స్పష్టం చేశారు. తమ యూజర్ల ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్‌లు లీక్ అయ్యాయని, థర్డ్ పార్టీ సర్వర్ నుంచి ఇవి హ్యాక్‌కు గురైనట్టు ముకుంద్ వివరించారు. హ్యాక్‌కు గురైన సంగతి తాము వెంటనే గుర్తించామని, తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. యూజర్ల డేటా మరింత సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నామని ముకుంద్ పేర్కొన్నారు. అయితే, వినియోగదారులు చెల్లింపులు జరుపుతున్న కార్డు నెంబర్లు, ఇతర వివరాలేవీ లీక్ అయ్యే అవకాశం లేదని ముకుంద్ తెలిపారు. వినియోగదారులు పాస్‌వర్డ్‌లను మార్చుకోవాల్సిన అవసరం లేదని, వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లతోనే యాప్‌ను నిర్వహిస్తున్నట్టు, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఎంతమంది వినియోగదారుల డేటా లీకైందో స్పష్టమైన వివరాలు డంజో చెప్పలేదు. కరోనా తర్వాత అంతర్జాతీయంగా సైబర్ దాడులు, డేటా ఉల్లంఘనలు పెరిగాయి. ఇటీవలే ఇండియా బుల్స్ గ్రూప్‌లోనూ రాన్‌సమ్‌వేర్ అటాక్ జరిగిందని అమెరికాకు చెందిన ఇంటిలిజెన్స్ కంపెనీ వెల్లడించింది.