పోలీసులా.. కేసీఆర్‌కు కాపలా కుక్కలా: దాసోజు శ్రవణ్

by Shyam |
పోలీసులా.. కేసీఆర్‌కు కాపలా కుక్కలా: దాసోజు శ్రవణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఉన్నది పోలీసులా..? టీఆర్ఎస్ పార్టీ పాలెగాళ్ళ..? అంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో తొక్కుతాం చంపుతానని బెదిరించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికార పార్టీకి పోలీసులు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనకు ఉద్యోగం కావాలి.. న్యాయం చేయండి అని అడిగినందుకు అమాయక వ్యక్తిపై దాడులు చేయడమేంటని నిలదీశారు. ఉపఎన్నిక ప్రచారంలో ఓయూ దళిత విద్యార్థి నాయకుడు మానవతా రాయ్‌పై ఎస్సై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా డీజీపీ మహేందర్‌కు లేఖ రాశామన్నారు. అమాయక జనాలు, కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ శ్రేణులు అధికార పార్టీ బెదిరింపులకు భయపడవద్దని.. వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా అండగా ఉంటుందని దాసోజు శ్రవణ్ భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed