దాసోజు శ్రవణ్‌ తండ్రి చనిపోవడానికి కారణమిదే..

by vinod kumar |
దాసోజు శ్రవణ్‌ తండ్రి చనిపోవడానికి కారణమిదే..
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌ తండ్రి కృష్ణమాచారి సోమవారం కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన గత కొంత కాలంగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల ప్రయత్నాలు ఫలించక సోమవారం ఉదయం 11 గంటలకు చనిపోయినట్టు శ్రవణ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. శ్రవణ్ తల్లి దాసోజు జోగమ్మ కూడా కోవిడ్‌ బారినపడి ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనాతో మృతిచెందిన కృష్ణమాచార అంత్యక్రియలు అంబర్‌పేట శ్మశాన వాటికలో సాయంత్రం జరిగాయి.

దాసోజు శ్రవణ్ తండ్రి కృష్ణమాచారి మృతి పట్ల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మణికం ఠాగూర్, సీనియర్ నేత శశి థరూర్ సహా ఏఐసీసీ కార్యదర్శులు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, వివిధ పార్టీల నేతలు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రవణ్ తల్లి జోగమ్మ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో దాసోజు కృష్ణమాచారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.



Next Story

Most Viewed