యాదాద్రిలో దర్శనాలకు బ్రేక్

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి-భువనగిరి జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతూ… విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో యాదాద్రిలో  బుధవారం నుంచి శుక్రవారం వరకు  మూడ్రోజుల పాటు భక్తులకు దర్శనాలు నిలిపి వేశారు. అయితే స్వామివారికి రోజూ నిర్వహించే నిత్య కైంక్యారాలు యథావిధిగా జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ సేవలు, ఏకాంత సేవలు జరుగుతాయని స్పష్టం చేశారు. శనివారం నుంచి స్వామివారి దర్శనాలు తిరిగి ప్రారంభమవుతాయని  ఆలయ ఈవో గీతారెడ్డి పేర్కొన్నారు.

Advertisement