ఏటీపీ ఫైనల్స్‌లో మెద్వెదేవ్, రూబ్లేవ్ విజయం

by Shyam |
ఏటీపీ ఫైనల్స్‌లో మెద్వెదేవ్, రూబ్లేవ్ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది ఆఖరి టెన్నిస్ ఈవెంట్ అయిన ఏటీపీ టూర్ ఫైనల్స్‌ రౌండ్ రాబిన్ మ్యాచ్‌లలో మెద్వెదేవ్, రూబ్లెవ్ విజయం సాధించారు. తొలుత జరిగిన మ్యాచ్‌లో 5వ సీజ్ రూబ్లేవ్ 6-4, 6-4 తేడాతో 4వ సీజ్ సిట్సిపాస్‌పై గెలిచాడు. గత కొన్నాళ్లుగా ఫామ్‌లో లేని సిట్సిపాస్‌పై రూబ్లేవ్ పూర్తి ఆధిక్యత ప్రదర్శించి వరుస సెట్లలో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. గంటన్నర పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సిట్సిపాస్ ఒక్క బ్రేక్ పాయింట్ కూడా సాధించలేకపోయాడు. ఇక మరో మ్యాచ్‌లో 2వ సీడ్ మెద్వెదేవ్ 6-3, 6-7 (3/7), 7-6(8/6) తేడాతో 3వ సీడ్ జ్వెరెవ్‌పై విజయం సాధించాడు. మొదటి నుంచి ఇద్దరు ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్లు ఆడారు. పోటా పోటీగా సాగిన మ్యాచ్‌లో రెండు సెట్లు టై బ్రేకర్‌కు వెళ్లడం గమనార్హం. అయితే నిర్ణయాత్మక మూడో సెట్‌లో మెద్వెదేవ్ టై బ్రేకర్‌లో ఆధిపత్యం సాధించి మ్యాచ్ గెలిచాడు. గ్రీన్ గ్రూప్‌లో జకోవిచ్, రూబ్లేవ్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. రెడ్ గ్రూప్‌లో మెద్వెదేవ్, జ్వెరెవ్ టాప్‌లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed