- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రపంచాన్ని ఊపేస్తున్న పాట.. దేశీస్టెప్పులతో హల్‌చల్

దిశ, ఫీచర్స్: స్పెయిన్‌లో తెరకెక్కిన ‘మనీ హీస్ట్’ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. కోట్లాది వ్యూయర్‌షిప్‌తో ఎన్నో రికార్డ్స్ కొల్లగొట్టిన ఈ వెబ్ సిరీస్‌లో మనీ హీస్ట్ థీమ్ మ్యూజిక్ కంటే.. ఈ సిరీస్ మొత్తంలో చాలాసార్లు ప్లే అయ్యే ‘బెల్లా సియావో(బెల్లా చావ్)’ పాటే ప్రపంచాన్ని ఊపేసింది. సోషల్ మీడియాలో దీనిపై లెక్కలేనన్నీ వీడియోలున్నాయి. ఇదో ఇటాలియన్ జానపద పాట కాగా మనీ హీస్ట్‌లో ఉపయోగించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ పెప్పీ నెంబర్‌ను ఇప్పటికే రకరకాలుగా ఉపయోగించుకోగా.. దీనికి ముగ్గురు డ్యాన్సర్స్ దేశీ ట్విస్ట్ ఇవ్వడంతో మరోసారి నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
డ్యాన్సర్ నికోల్ కాన్సెసావో తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో.. ‘పాపులర్ బెల్లా సియావోకు దేశీ ట్విస్ట్ ఇవ్వడం ఎంతో నచ్చింది. ఈ హుక్ స్టెప్‌ని సృష్టించడం ఆనందంగా ఉంది. ఇక మీ రీల్స్‌ను మళ్లీ క్రియేట్ చేయడం, వాటిని షేర్ చేయడం ఇక మీ వంతు!’ అంటూ ‘దేశీ స్టెప్పులతో’ తాము చేసిన వీడియోను ఇటీవల పోస్ట్ చేసింది. ఇందులో ‘మనీ హీస్ట్’ ఐకానిక్ కాస్ట్యూమ్స్ ధరించిన డ్యాన్సర్స్ మాస్ స్పె్ప్పులతో ఇరగదీశారు. ‘వావ్ ఇట్స్ అమేజింగ్’, ‘వాట్ ఎ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.