సరికొత్త..చ్యవన్‌ప్రాశ్ ఐస్‌క్రీమ్

by Sujitha Rachapalli |
సరికొత్త..చ్యవన్‌ప్రాశ్ ఐస్‌క్రీమ్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్..ప్రపంచ శాస్త్రవేత్తలకు కొత్త సవాళ్లు విసురుతూనే ఉంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ సమయంలోనే కరోనాతో కోలుకున్నవారు ‘ఇమ్యూనిటీ’ పెంచుకోవాల్సిందిగా చెబుతున్నారు. కరోనాను ఎదుర్కోవడానికి అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఈ క్రమంలో చాలా సంస్థలు ఇమ్యూనిటీ పెంచే ప్రొడక్ట్స్‌తో ముందుకు వస్తున్నాయి. కేరళకు చెందిన ఓ డైరీ సంస్థ కూడా చ్యవన్‌ప్రాశ్, పసుపుల మిశ్రమంగా ఓ ఐస్‌క్రీమ్‌ను తీసుకొచ్చింది. రోగ నిరోధకశక్తి పెంచేందుకు ఈ ఐస్‌క్రీమ్ ఉపయోగపడుతుందని సంస్థ చెబుతోంది.

కరోనా వైరస్ ప్రభావంతో చాలా మంది..ఆయుర్వేదిక్ ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటున్నారు. అందులో ‘చ్యవన్‌ప్రాశ్’ కూడా ఒకటి. ఇమ్యూనిటీ పెంచే ఔషధంగా దీన్ని పెద్దలతో పాటు ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతూ వస్తున్నారు. చాలా మంది ఇండ్లలో చిన్న పిల్లలకు జలుబు రాకుండా ఉండేందుకు దీన్ని తినిపిస్తుంటారు. కానీ, పిల్లలు ఈ రుచిని తినడానికి పెద్దగా ఇష్టపడరు. అందుకే తినడానికి ఆసక్తి చూపించరు. అయితే, చ్యవన్‌ప్రాష్ ఇప్పుడు ఐస్‌క్రీమ్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. ఐస్‌క్రీమ్ తినడానికి ఇష్టపడే పిల్లలను ఆకట్టుకోడానికి కేరళకు చెందిన ‘డైరీ డే’ అనే సంస్థ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంట్లో చ్యవన్‌ప్రాశ్‌తో పాటు.. ఖర్జూరాలు, ఉసిరి మిశ్రమాలను కూడా ఐస్‌క్రీమ్‌కు యాడ్ చేశారు.

‘కరోనా వైరస్ నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని తప్పకుండా పెంపొందించుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు ఇది చాలా అవసరం. ఈ విషయాన్ని దృష్టిలోపెట్టుకుని ఈ ఐస్‌క్రీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇది పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తుంది’ అని ఆ సంస్థ పేర్కొంటోంది. కేవలం చ్యవన్‌ప్రాశ్ మాత్రమే కాదు.. పసుపు, చింతపండు, తేనె కలిపిన ఐస్‌క్రీమ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా ఐస్‌క్రీమ్‌లను మార్కెట్లోకి తెస్తున్నామని ప్రకటించింది. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో పోస్టుచేసిన ప్రకటన ఇప్పుడు వైరల్‌‌గా మారింది

Advertisement

Next Story

Most Viewed