- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేస్త్రీ ఆత్మహత్యాయత్నం.. ఎమ్మెల్యేనే కారణమా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లికి చెందిన నాంపల్లి మల్లేశంమ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే … చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు చెందిన భవనానికి మేస్త్రీగా మల్లేశం పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే సదరు ఎమ్మెల్యే మల్లేశంకు రూ. 9 లక్షలు బాకీ పడ్డారు. అయితే తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని మల్లేశం పలుమార్లు ఎమ్మెల్యేను అడగగా ఆయన ఇవ్వకపోవడంతో, ఆర్థిక ఇబ్బందులకు గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అపస్మారక స్థితికి చేరుకున్న మల్లేశంను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మల్లేశం ఆత్మహత్యకు గల కారణాలు ఏంటన్న విషయంపై అతని కుటుంబ సభ్యులు స్పష్టత ఇవ్వడం లేదు. పోలీసులకు కూడా ఎలాంటి ఫిర్యాదు చేయనట్టు సమాచారం. మల్లేశం సూసైడ్‌కు ప్రయత్నించిన విషయం తెలియగానే స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు రంగంలోకి దిగి మల్లేశం కుటుంబ సభ్యులతో రాయబారం నడిపించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే మల్లేశం కుటుంబ సభ్యులు మీడియా ముందు మాట్లాడడానికి నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే మరోవైపున బాధితుడు మల్లేశం, అతడి భార్య.. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొడుకు దీక్షిత్‌తో మాట్లాడిన ఆడియో రికార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. తన భర్త ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నాడని.. తన కూతురుకు ఫోన్ చేసి చెప్పారని ఇందులో ఎవరి పేరు ప్రస్తావించలేదని మాట్లాడారు. కొంతమంది తన వద్దకు వచ్చి ఎవరైనా బెదిరింపులకు గురి చేశారా అంటూ అడుగుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ ఇస్తే తానే మాట్లాడుతానని ఆమె దీక్షిత్‌తో మాట్లాడిన ఆడియో రికార్డులు వైరల్ అవుతున్నాయి.