ఫోటోగ్రాఫర్లకు నిత్యావసరాల పంపిణీ

by Shyam |
ఫోటోగ్రాఫర్లకు నిత్యావసరాల పంపిణీ
X

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పువ్వాడ ఫౌండేషన్ చైర్మన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం పట్టణంలో 100 మంది ఫోటోగ్రాఫర్లకు క్యాంపు కార్యాలయంలో నిత్యావసర వస్తువులు పంపిణీ‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ కుమార్‌కు ఖమ్మం జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు నాగరాజు దేవర ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కె.రఘు, కొవిడ్ హెల్పింగ్ కమిటీ సభ్యులు, జిల్లా జాయింట్ సెక్రెటరీ బి.శేషగిరి, రఘునాధపాలెం మండల ప్రెసిడెంట్ బాలాజీ, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ మారగాని వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Tags : Photographers, Puvvada Association, Minister Ajay Kumar, Daily needs


Advertisement
Next Story

Most Viewed