ఓట్ల కోసం.. ఓ మంత్రి చేసిన పని వైరల్

by Shamantha N |
ఓట్ల కోసం.. ఓ మంత్రి చేసిన పని వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పార్టీల అభ్యర్థులు వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తాజాగా తమిళనాడులోని రాయపురం నియోజకవర్గంలో మంత్రి, ఏఐఏడీఎంకే అభ్యర్థి డీ.జయకుమార్ బట్టలు ఇస్త్రీ చేసి తనకు ఓటు వేయాలని కోరారు. మరోసారి తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

Advertisement

Next Story

Most Viewed