ప్రాణదాతలుగా.. సైబరాబాద్ పోలీసులు

by Shyam |
ప్రాణదాతలుగా.. సైబరాబాద్ పోలీసులు
X

దిశ, క్రైమ్‌బ్యూరో: సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో పోలీసులు రక్తదాన శిబిరాలకు శ్రీకారం చుట్టారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, తలసేమియా సైకిల్ సొసైటీ, రెడ్‌క్రాస్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంతో పాటు, కమిషనరేట్ పరిధిలో 37 పోలీస్ స్టేషన్లలో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. 2వేల యూనిట్ల రక్త నిల్వలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న పోలీసులు బుధవారం మాదాపూర్, పేట్‌బషీర్‌బాగ్, రాజేంద్రనగర్, షాబాద్, బాచుపల్లి, ఆర్సీపురం తదితర పోలీస్‌స్టేషన్లలో నిర్వహించిన శిబిరాల ద్వారా 500 యూనిట్ల బ్లడ్‌ను సేకరించారు. రక్తదాన శిబిరాలకు ప్రత్యేక ఇన్‌చార్జ్‌ను నియమించుకున్నారు. రక్తదానం చేయాలనుకునేవారు 79011 25460 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed