- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తల్లిదండ్రులే మనకు దేవుళ్లు : సజ్జనార్
దిశ, క్రైమ్ బ్యూరో: తల్లిదండ్రులు కన్పించే దేవుళ్లు అని, అలాంటి తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేయకూడదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. రానున్న రోజుల్లో వృద్ధాశ్రమాలు లేని నవ సమాజాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని సికింద్రాబాద్ కార్ఖానాలో ఆర్‌కేఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సీపీ సజ్జనార్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్దులతో కలిసి నూతన సంవత్సర కేక్‌ను కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తల్లిదండ్రులు కన్పించే దేవుళ్లు అని అన్నారు. మనం ఏ స్థాయిలో ఉన్నా.. తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రతిఒక్కరూ దేశ భద్రత, అభివృద్ది కోసం పునరంకితమై దేశ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీ సజ్జనార్ సతీమణి అనుపవి సజ్జనార్, కుమార్తెలు అధితి, నియతి, సమర్థ్, సమృద్, ఆర్‌కేఎస్ ఫౌండర్ డాక్టర్ రామకృష్ణ, మేనేజర్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.