- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మూడేళ్లుగా.. 400 మంది అలాగే చనిపోయారు’
దిశ, క్రైమ్ బ్యూరో: ప్రజల్లో సరైన అవగాహన లేకనే రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారణకు రోడ్ సేఫ్టీ చెక్ పోస్టులు దోహదపడతాయని అన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని నేషనల్ హైవే 44 లోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద, పటాన్ చెరువు ఇక్రిశాట్ వద్ద సీపీ సజ్జనార్ శుక్రవారం ఈ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మొదటి సారిగా సైబరాబాద్ పరిధిలోనే రోడ్డు సేఫ్టీ చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదాల కారణంగా షాద్‌నగర్ పరిధిలో గత మూడేళ్లుగా సుమారుగా 400 మంది చనిపోయారని, 1000 మందికి పైగా గాయాలపాలయ్యారని తెలిపారు.
రోడ్లపై ప్రయాణించే ప్రయాణికులలో హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్లలో వాహనాలు నడిపే వారి వల్లనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. హెల్మెట్ లేని కారణంగా 75 శాతం మంది చనిపోతున్నారని అన్నారు. మైనర్ యువతీ, యువకులకు వాహనాలు ఇవ్వడం కారణంగానే ప్రమాదాలు ఎక్కువవుతున్నాని అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారణకు ప్రజల్లో సరైన అవగాహన కల్పించేందుకు, రోడ్డు భద్రత కోసం 24 గంటలు పని చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, ఏసిపి విశ్వప్రసాద్, షాద్ నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రవి కుమార్ లను ప్రత్యేకంగా అభినందించారు.