అధిక వడ్డీల పేరుతో మోసం.. రూ.3 కోట్ల నగదు సీజ్

by Shyam |
CP Sajjanar
X

దిశ, వెబ్‌డెస్క్: అధిక వడ్డీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ముగ్గురు నిందితుల నుంచి 4 లాప్‌ట్యాప్స్, రూ. 3 కోట్ల నగదు, మొబైల్ ఫోన్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. నిందితులు కూకట్‌పల్లికి చెందిన ఉదయ్ ప్రతాప్, ఢిల్లీకి చెందిన నితేష్, రాజేష్‌లుగా గుర్తించారు. చైనాకు చెందిన జాంగ్ హంగ్వై, పెంగ్ గువెయ్ అనే ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

ఈ ముఠా రెండు ఫేక్ కంపేనీలు సృష్టించి, ఓ మొబైల్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతుందని సీపీ సజ్జనార్ తెలిపారు. షేరింగ్ ఎకానమీ పేరుతో దేశవ్యాప్తంగా డిపాజిట్ల పేరుతో డబ్బులు వసూలు చేశారని చెప్పారు. 90 రోజుల వ్యవధిలో నాలుగు రెట్లు అధికంగా డబ్బులు ఇస్తామని నమ్మించి.. 20 వేల మంది నుంచి డబ్బులు వసూలు చేశారని తెలిపారు. సీసీసీవో లింక్ పేరుతో సోషల్ సైట్‌లో వైరల్ చేశారని.. లింక్‌ను క్లిక్ చేస్తే బెంగళూరుకు చెందిన రేజర్ పే యూపీఐ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. రేజర్ పే గేట్ వే ద్వారా చెల్లించిన డబ్బులు చైనా వెబ్‌సైట్లకు లింక్ అయినట్లు తేలిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed