- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్బీఐ సీజీఎంను కలిసిన సీపీ సజ్జనార్.. ఎందుకంటే !
దిశ, క్రైమ్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీజీఎం యోగేష్ దయాల్‌తో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ గురువారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మొబైల్ యాప్ రుణాలకు సంబంధించిన విషయాలను, బాధితులు మోసపోతున్న తీరును సీపీ సజ్జనార్ వివరించారు. ఈ సందర్భంగా ఆర్బీఐ సీజీఎం యోగేష్ దయాల్ మాట్లాడుతూ మొబైల్ యాప్ రుణాల విషయంలో వేధింపులకు పాల్పడితే వారిపై ఆర్‌బీఐ సచేత పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. సులభంగా రుణాలు ఇస్తామని చెబుతున్న అనధికార డిజిటల్ ఋణ వ్యవస్థల వాగ్దానాలకు వ్యాపారస్తులు, అమాయక ప్రజలు దగా పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణ గ్రహీతల ఫోన్ కాంటాక్ట్ వివరాలను సేకరిచడం, నిబంధనలకు విరుద్దం అన్నారు.
రిజర్వ్ బ్యాంకులో నమోదయిన బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, వివిధ రాష్ట్రాల చట్ట నిబంధనల (మనీ లెండింగ్ చట్టాలు) నియంత్రణలో ఉన్న సంస్థలు మాత్రమే ప్రజలకు న్యాయపరంగా రుణాలు జారీ చేస్తాయన్నారు. ఆన్ లైన్, మొబైల్ యాప్‌ల ద్వారా రుణం మంజూరు చేస్తున్న కంపెనీ పూర్వాపరాలు పరిశీలించాలని, అక్రమ సంస్థల మోసాలకు బలికావద్దని ప్రజలను సూచించారు. ఈ తరహా ఫిర్యాదులను బ్యాంక్ ఖాతా వివరాలతో దర్యాప్తు సంస్థలకు కానీ, ఆన్‌లైన్ లో ‘సచేత్ పోర్టల్’ https://sachet.rbi.org.in ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. రిజర్వ్ బ్యాంకు ద్వారా నమోదయిన బ్యాంకింగేతర సంస్థల పేర్లు, చిరునామాల కోసం https://cms.rbi.org.in పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.