రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు

by Shyam |   ( Updated:2020-09-02 11:01:36.0  )
రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఓ వ్యక్తి ప్రమేయం లేకుండా అతడి పేరు మీద 6 బ్యాంకుల నుంచి రూ.6లక్షల రుణం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సునీల్.. ఇటీవల సిబిల్ స్కోరు చూసుకోగా తక్కువ ఉండటంతో ఆరా తీశాడు. అయితే అతడు ఆరు బ్యాంకుల్లో రుణం తీసుకున్నట్లు తేలింది. ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో డిఫాల్ట్ అయ్యిందని తెలుసుకొని జరిగిన మోసంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరగాళ్లు బాధితుడి పాన్ కార్డు వివరాలు తెలుసుకొని ఆన్ లైన్‌లో ఇన్‌స్టంట్ లోను సదుపాయంతో రుణాలు పొందినట్లు పోలీసులు ఓ ప్రాథమిక విచారణకు వచ్చారు. అయితే రుణాలు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయన్నదానిపై ఆరా తీస్తున్నారు.

Advertisement

Next Story