- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ.4లక్షల లోనుకు.. 2లక్షల ప్రాసెసింగ్ ఫీజు
దిశ, క్రైమ్‌న్యూస్: పర్సనల్ లోను విషయంలో మోసపోయిన ఓ వ్యక్తి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన తాల్లూరి శ్రీనివాసరావు పర్సనల్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తుండగా … రిలయన్స్ ఫైనాన్స్ గ్రూపునకు చెందినదిగా భావించి క్లబ్ డాట్ కమ్ వైబ్‌సెట్‌కు ఆకర్షితుడయ్యాడు. జూన్ 21న ఆన్‌లైన్‌లో ఐడీ ప్రూఫ్, క్యాన్సిల్ చెక్‌తో రూ.4లక్షల లోన్‌కు అప్లై చేశాడు.
దీంతో వెంటనే లోన్ ప్రాసెస్ ఫీజు, సెక్యూరిటీ ఇన్సూరెన్స్ రూ.1.03లక్షలు చెల్లించాలంటూ వచ్చిన వాట్సప్ మెసేజ్‌కు స్పందించిన బాధితుడు.. అకౌంట్లో నగదు జమ చేశాడు. కొద్ది సేపటికే అభిషేక్ అనే వ్యక్తి ఫోన్ చేసి మీలోన్ ప్రాసెస్ పూర్తయ్యిందని, ఆర్బీఐ నిబంధనల ప్రకారం మరో రూ.90వేలు జమ చేయాలని చెప్పగా మళ్లీ అకౌంట్లోకి మనీ ట్రాన్స్‌ఫర్ చేశాడు. మళ్లీ రెండ్రోజులకు మరో రూ.62వేలు వేశాడు. మొత్తం రూ.2.56లక్షలు జమ చేసినప్పటికీ లోను రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.