‘ఈ- సిమ్ బ్లాక్’ పేరిట సైబర్ చీటర్స్ దందా

by Anukaran |   ( Updated:2020-07-25 05:20:48.0  )
‘ఈ- సిమ్ బ్లాక్’ పేరిట సైబర్ చీటర్స్ దందా
X

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా దందాలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ సిమ్ పేరిట అరాచకాలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఈ క్రమంలోనే అయోమయానికి గురవుతున్న వినియోగదారులు సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన సైబర్ మోసాలపై పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.

ఈ-సిమ్ బ్లాక్ అవుతోందంటూ మెసేజ్‌లు పెడుతున్న సైబర్ ముఠాలు వినియోగదారులను టెన్షన్ పెడుతున్నాయి. మెసెజ్‌లో ఉన్న ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తున్న వినియోగదారులు .. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు కేవైసీ నింపి మోసపోతున్నారు. కొత్తరకంగా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పంపిస్తున్న సైబర్ చీటర్స్.. మెయిల్స్‌ను సర్వీస్ ప్రొవైడర్లకు వినియోగదారుల ద్వారా పంపించి ఫోన్ నెంబర్లు హ్యాక్ చేస్తున్నారు. ఇదే క్రమంలో బ్యాంక్ డిటేయిల్స్ కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు వినియోగదారుల నుంచి నగదు లూటీ చేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సిమ్ పేరిట ఇప్పటివరకు రూ.50లక్షల వరకు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed