- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోనియాను అధ్యక్షురాలిగా కొనసాగించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. సుదీర్ఘంగా 7గంటల పాటు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంపై సాయంత్రం 7గంటలకు ఏఐసీసీ ప్రెస్‌మీట్ నిర్వహించి ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. పార్టీ నాయకత్వాన్ని మార్చాలని 23మంది నేతలు రాసిన లేఖపై చర్చించామని, లేఖలోని పలు అంశాలపై నేతలు స్వేచ్ఛగా మాట్లాడారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
గత ఆరునెలల్లో కాంగ్రెస్ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందని, పార్టీ నాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదని ఆయన పేర్కొన్నారు. సోనియా, రాహుల్ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని, మతతత్వ శక్తులపై రాజీలేని పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్ నాయకత్వాన్ని కార్యకర్తలు బలోపేతం చేయాలని, పార్టీలోని అంతర్గత విషయాలను మీడియాకు లీక్ చేయొద్దని సూచించారు.