స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో అపశృతి

by srinivas |
podduturu
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి స్వగ్రామం ఎర్రగుంట్ల మండల పరిధిలోని నిడిజివ్వి గ్రామ సచివాలయంలో పతాకావిష్కరణ కోసం ఇనుప పైపును గ్రీన్‌ అంబాసిడర్‌ సిద్దయ్య.. తోటి గ్రామస్తుడు హుస్సేన్‌తో కలిసి నిలబెడుతున్న సందర్భంలో పైపు కరెంట్ తీగలపై పడింది. దీంతో ఆ ఇద్దరితోపాటు తన్వీర్‌ అనే బాలుడు కూడా కరెంటు షాక్‌కు గురయ్యారు. అక్కడే ఉన్న వాలంటరీ అంజిరెడ్డి అప్రమత్తమై కరెంటు తగిలిన పైపును తొలగించడంతో ప్రమాదం తప్పింది. గాయపడినవారిని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం తెలుసుకున్న మున్సిపల్‌ చైర్మన్‌ హర్షవర్ధన్‌ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి గాయపడినవారిని పరామర్శించారు.


Advertisement
Next Story

Most Viewed