- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎస్కే వైస్ కెప్టెన్ ఆ ఇద్దరిలో ఎవరు..?
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుండటంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముందుగానే ముంబయి చేరుకున్నది. గత ఏడాది పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కున్న ధోనీ నేతృత్వంలోని సీఎస్కే.. ఈ సారి మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నది. గత సీజన్ ముందు వరకు చెన్నై జట్టుకు ధోనీ కెప్టెన్‌గా ఉండగా.. సురేష్ రైనా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వ్యక్తిగత కారణాల వల్ల సురేష్ రైనా గత సీజన్ ఆడకపోవడంతో వైస్ కెప్టెన్ లేకుండానే సీఎస్కే ఐపీఎల్ ఆడింది. అయితే ఈ సారి రైనా జట్టుతో చేరడంతో మరోసారి అతడికి వైస్ కెప్టెన్సీ ఇస్తారా లేదా అనే సందిగ్దత నెలకొన్నది. వచ్చే వారంలో సీఎస్కేకు వైస్ కెప్టెన్‌ను నియమిస్తామని సీఈవో కాశీ విశ్వనాథన్ చెప్పారు. సురేష్ రైనా లేదా రవీంద్ర జడేజాలో ఒకరికి ఈ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే జడేజా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. సీజన్ మొత్తం ఆడే ఫిట్‌నెస్ సాధించాడా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఇద్దరిలో ఒకరిని మాత్రం వైస్ కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.