- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ పనులకు అడ్డంకి
దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా అర్దాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లను యూఏఈ వేదికగా సెప్టెంబర్ 17 నుంచి నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించింది. ఆగస్టు రెండో వారం నుంచే ఆయా ఫ్రాంచైజీలు యూఏఈకి తమ క్రికెటర్లను తరలించడానికి ఏర్పాట్లు చేయాలని భావించింది. అయితే ప్రస్తుతం యూఏఈ ప్రభుత్వం ఇండియా నుంచి వచ్చే విమానాలపై జులై మూడో వారం చివరి వరకు నిషేధం విధించింది. దీంతో ఆయా ఫ్రాంచైజీలకు చెందిన అధికారులు యూఏఈ వెళ్లి లాజిస్టిక్స్‌తో పాటు హోటల్ బుకింగ్ తదితర పనులను పూర్తి చేయడానికి వీలు కలగడం లేదు. జులై చివరికైనా నిషేధం ఎత్తివేస్తే వెళ్లి ఐపీఎల్ సంబంధిత పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. కానీ అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఇదే విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ మీడియాతో మాట్లాడారు. క్రికెటర్లు, కోచ్, ఇతర సిబ్బంది బస ఏర్పాట్లతో పాటు లాజిస్టిక్స్ సమస్యల పరిష్కారానికి విమాన ప్రయాణాలు ఇబ్బందిగా మారాయని అన్నారు. విమాన ప్రయాణాలు సజావుగా సాగకపోవడంతో ఐపీఎల్ పనులకు అడ్డంకిగా మారిందని ఆయన చెప్పారు.