- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్మోకింగ్ కొవిడ్ ముప్పును పెంచుతుందా..?
దిశ, ఫీచర్స్ : కొవిడ్ సోకిన కొందరిలో ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతుండగా.. పరిస్థితి విషమించి మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని వ్యక్తిగత అలవాట్లు సైతం కరోనా ముప్పును తీవ్రతరం చేస్తు్న్నట్టుగా పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు కొవిడ్ సోకిన వ్యక్తులకు స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) తెలపగా.. అలాంటి అధ్యనాలేవీ జరగలేదని సీఎస్‌ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) స్పష్టం చేసింది.
‘కొవిడ్-19 మప్పును పెంచేందుకు స్మోకింగ్ దోహదపడుతుందని ఏదైనా స్టడీ నిరూపిస్తే.. ఏడాది కాలంగా ఎంతమంది స్మోకర్స్ కరోనా బారినపడ్డారో తెలిపే రిపోర్ట్ కాపీని అందజేయండి’ అని యాక్టివిస్ట్ గౌరవ్ ఆర్టీఐ ప్రశ్న ద్వారా గత నెల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరాడు. ఈ మేరకు స్పందించిన ఆరోగ్య శాఖ.. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్, ఐసీఎంఆర్, సీఎస్‌ఐఆర్, ఎన్‌సీడీసీ’లకు ఆ రిక్వెస్ట్ ఫార్వార్డ్ చేసింది. కాగా కొన్ని అధ్యయనాలు స్మోకర్స్‌కు కొవిడ్ ముప్పును పెంచడంలో పొగాకు పాత్ర ఉందని స్పష్టం చేస్తున్నాయని ఐసీఎంఆర్ తెలపడంతో పాటు కొవిడ్-19 పాండమిక్, ఇండియలో పొగాకు వినియోగంపై కేంద్ర మంత్రిత్వ శాఖ జారీచేసిన అడ్వైజరీని జతచేసింది. కాగా ఇదే విషయాన్ని ఎలాంటి అధ్యయనాలు రూఢీ చేయలేదని చెబుతూ సీఎస్ఐఆర్ రిప్లయ్ ఇచ్చింది. పైగా స్మోకర్స్, వెజిటేరియన్స్‌కు కొవిడ్ ఇన్‌ఫెక్షన్ తక్కువని ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వే ఆధారంగా వెల్లడించడం గమనార్హం. ఈ నేపథ్యంలో రెండు ప్రభుత్వ సంస్థలు విరుద్ధ ప్రకటనలతో జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి.