సీఎస్ ఆదేశిస్తే కలెక్టర్ ఏం చెప్పారో తెలుసా?

దిశ, మేడ్చల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం(ఎన్ఆర్ఇజిఎస్) నిధులతో జిల్లాలోని అన్ని గ్రామాలలో ట్యాంకులు, కాలువల నిర్మాణ పనులు చేపట్టాలని సీఎస్ సోమేశ్ కుమార్ అదేశించినట్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో సీఎస్ నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో మేడ్చల్ కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆ వివరాలను మీడియాకు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎన్ఆర్ఇజిఎస్ జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వంద రోజుల పని దినాలు కల్పించాలని సీఎస్ అదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ఖరీప్ పనులను ప్రారంభం అవుతున్నందున అవసరమైన కాలువలను గుర్తించి నిర్మాణపు పనులు చేపట్టాలన్నారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లోని ప్రధాన రహదారికి ఇరువైపుల ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని సూచించారు. పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాలలోని ఖాళీ స్థలాలలో మొక్కలు నాటాలని సీఎస్ పిలుపునిచ్చినట్లు వాసం వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement