- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్టోబర్ 10లోపు రైతు వేదికల నిర్మాణం
దిశ, న్యూస్బ్యూరో: అక్డోబర్ 10లోపు రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం విలీన గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించాలని, అభివృద్ధిపై కలెక్టర్లు వ్యక్తిగతంగా పరిశీలించాలని ఆదేశించారు. అంటువ్యాధుల నివారణకు శానిటేషన్ తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 17జిల్లాలకు అదనపు కలెక్టర్ల నియామకంతో మొత్తం 29 మంది అదనపు కలెక్టర్లను స్థానిక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు నియమించిన నేపథ్యంలో ఈ వీడీయో కాన్పరెన్స్ నిర్వహించారు. మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్యక్రమాలపై, యాంటీ లార్వా, క్రిమి సంహారక స్ర్పేయింగ్, వెక్టర్ బర్న్ వ్యాధుల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి కొనసాగిస్తూ మరింత విస్తృతంగా చేపట్టాలన్నారు. వీటితో పాటు రైతు బంధు, కల్లాల నిర్మాణం, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల కోసం స్థలాల ఎంపికతో పాటు ఉపాధి హామీ ద్వారా వివిధ శాఖల్లో చేపడుతున్న పనులపై సమీక్షించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, వ్యవసాయ శాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.