గ్యారెంటీ క్రెడిట్ లైన్ రుణాలు అందించండి

by  |
గ్యారెంటీ క్రెడిట్ లైన్ రుణాలు అందించండి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు గ్యారెంటీ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ కింద పూచీకత్తు లేని రుణాలు అందించడానికి కలెక్టర్లు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. గురువారం బీఆర్‌కే భవన్‌లో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజీపై జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఎక్కవ మందికి లబ్ది చేకూర్చే విధంగా కలెక్టర్లు తమ జిల్లాల్లోని పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్లతో తరచూ సమీక్షలు నిర్వహించాలని సూచించారు.

రుణాలు అందించేందుకు రాష్ట్రాలకు ఎలాంటి పరిమితి లేనందున వీలైనంత సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సదుపాయం కల్పించడంపై దృష్టి సారించాలన్నారు. క్రెడిట్ గ్యారంటీ స్కీం ఫర్ సబార్డినేట్ డెబిట్ కింద అర్హత ఉన్న జాబితాను అందించాలని బ్యాంకర్లను కోరారు. బ్యాంకర్లు తమకు కేటాంయించిన లక్ష్యాల మేరకు రుణాలు అందించాలని కోరారు. సమావేశంలో పురపాలక పట్టణ అభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ కమిషనర్ మణిక్ రాజ్, సంచాలకులు డా.ఎన్.సత్యనారయణ పాల్గొన్నారు.


Next Story

Most Viewed