అన్ని అంశాలపై వివరాలు ఇవ్వాలి

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులందరినీ అప్రమత్తం చేస్తే.. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులను అలర్ట్ చేశారు. సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే అన్ని అంశాలపై మంత్రులకు ఎప్పటికప్పుడు తగిన వివరాలను, గణాంకాలను ఇవ్వడానికి వీలుగా సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసి ఉంచుకోవాలని అన్ని శాఖల, హెచ్ఓడీలను ఆదేశించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో గురువారం సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు.

Advertisement